‘ ది కాశ్మీర్ ఫైల్స్’ దేశవ్యాప్తంగా అనేక ప్రశంసలను పొందుతోంది. ముఖ్యంగా ప్రధానిమోదీ, హోంమంత్రి అమిత్ షాల నుంచి ప్రశంసలు అందుకుంది. 1990లో కాశ్మీర్ నుంచి పండిట్లను తరిమివేయడం.. వారిపై అత్యాచారాలు, హత్యాకాండను డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చాలా ధైర్యంగా చూపించారు.
ఇదిలా ఉంటే ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు తావిస్తోంది. ఇటీవల ఆదిలాబాద్ లో ఓ థియేటర్లో కొందరు ఆకతాయిలు పాక్ అనుకూల నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే యూపీలోని కుషినగర్ జిల్లాలోని ఫాజిల్ నగర్ లో సినిమా థియేటర్లో ముగ్గురిపై కత్తులతో దాడిచేశారు. సినిమా ముగిసిన తర్వాత జాతీయవాద నినాదాలు చేసిన యువకులపై ఓ వర్గం వ్యక్తులు కత్తులతో దాడులు చేశారు. బాధితులను సచిన్, కృష్ణ, రాహుల్‌లుగా గుర్తించారు. వీరు తీవ్రంగా గాయపడటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. హిందూ యువకులు జాతీయ నినాదాలు చేయడంతో ఓ వర్గం వ్యక్తులు అడ్డు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షన చోటు చేసుకుంది. దీంతో నినాదాలు చేసిన వారిపై కత్తులతో దాడి చేశారు. దాడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) అఖిలేష్ కుమార్ సింగ్ తెలిపారు.