వైరల్‌ వీడియో: ప్రాణం తీసిన ఫోటోల పిచ్చి..? చూస్తుండగానే నీళ్లలో కొట్టుకుపోయిన మహిళ

-

టూరిస్ట్‌ ప్లేస్‌లకు వెళ్లినప్పుడు సాధారణంగానే మనకు ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. అక్కడ ఫోటోలు దిగాలి, వీడియోలు చేయాలని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఆ ఫోటోలే మన ప్రాణాల మీదకు తెస్తాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ మహిళ ఫొటో కోసం ప్రయత్నిస్తూ నీళ్లలో పడి కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ముంబయిలోనే ఓ మహిళ తన భర్తతో పాటు కలిసి బీచ్‌లోని ఓ బండరాయిపై కూర్చుంది. ఆ సమయంలో వర్షం పడుతోంది. సముద్రపు అలలు ప్రమాదకరంగా ఎగిసిపడుతున్నాయి. అవేమీ పట్టించుకోకుండా ఆ భార్యాభర్తలు బండరాయిపై అలానే కూర్చుని ఫొటోలు తీయించుకుంటున్నారు. అప్పుడే మృత్యువు ముప్పు ముంచుకొచ్చింది.

అమ్మనాన్న అలా ఆస్వాదిస్తుంటే పిల్లలు కాస్త దూరంగా నిలబడి వీడియో తీస్తున్నారు. కాసేపటి వరకూ ఆ నీళ్లలో తడుస్తూ ఆస్వాదించారు. ఆ తరవాతే మృత్యువు పెద్ద అల రూపంలో దూసుకొచ్చింది. వాళ్ల కూర్చున్న బండరాయిపైకి ఓ పెద్ద అల వచ్చి తాకింది. ఆ తాకిడిన తట్టుకోలేక మహిళ నీళ్లలో పడిపోయింది. పిల్లలు చూస్తుండగానే అందులో పడి కొట్టుకుపోయింది. అప్పటి వరకూ వీడియో తీస్తున్న చిన్నారులు గట్టిగా అరిచారు. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. అప్పటి వరకూ వీడియో తీసిన చిన్నారులు ఫోన్‌ పడేసి మమ్మీ మమ్మీ అని కేకలు వేశారు. అప్పటికే ఆ మహిళ నీళ్లలో పడి చాలా దూరం కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్‌ల నుంచి కామెంట్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. రీల్స్ కోసం ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని మండి పడుతున్నారు. ఫోటోల కోసం నిండు ప్రాణాలను పోగొట్టుకుంది. అందుకే ఇలాంటి ప్లేస్‌లకు వెళ్లినప్పడు సముద్రం దూరంగానే ఉందికదా అని బండలపై కుర్చోని ఫోజులు ఇవ్వకూడదు. చెప్పలేం ప్రమాదం ఎటు నుంచి అయినా రావొచ్చు. ఏదో దూరంగా ఉండి నేచర్‌ను ఎంజాయ్‌ చేయాలి కానీ ఎందుకు ఈ విన్యాసాలు. ఇప్పుడు ఆ పిల్లలు తల్లిలేకుండా పెరగాలి..? కుటుంబం విచ్చిన్నం అయిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news