వేముల‌వాడ‌లో దారుణం.. పిల్ల‌ల గొంతు కోసి తాను కోసుకున్న త‌ల్లి

తెలంగాణ లోని రాజ‌న్న సిరిసిల్లా లోగ‌ల వేములవాడ‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక వివాహిత త‌న ఇద్ద‌రి పిల్ల‌ల‌తో ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేసింది. మ‌మ‌త అనే త‌ల్లి త‌న కుమార్తే అయిన అక్ష‌య‌, కుమారుడు వ‌రుణ్ తేజ్ గొంతు కోసి తాను గొంతు కోసుకుంది. అయితే స్థానికులు గ‌మ‌నించి సిరిసిల్లాలో ని ఆస్ప‌త్రి కి త‌ర‌లించారు.

అయితే వైద్యులు చికిత్స చేసి ముగ్గురు ప్రాణాల‌ను కాపాడారు. అయితే మ‌మ‌త, అక్ష‌య, వ‌రుణ్ తేజ్ జ‌గిత్యాల జిల్లా కొడిమ్యాల వాసులు గా పోలీసులు గుర్తించారు. కుటుంబ క‌ల‌హాల తో నే త‌ల్లి మమ‌త ఈ అఘాత్యానికి ఒడి గ‌ట్టింద‌ని తెలు స్తుంది. అయితే అత్త‌గారి ఇంటి వ‌ద్ద క‌లహాలు రావ‌డం తో పుట్టింటికి రావ‌డానికి ఈ రోజు ఉద‌యం బ‌య‌లు దేరింది. అయితే పుట్టింటికి వ‌స్తున్న క్ర‌మంలో మార్గ మ‌ధ్య లో వేములవాడ ప‌ట్ట‌ణానికి శివారు లో త‌ల్లి మ‌మ‌త ఈ అఘాత్యానికి పాల్ప‌డింది.