Attack on Couple: దారుణం.. బైక్ మీద వెళ్తున్న యువ జంట‌పై దాడి.. మంగళసూత్రం, నగలు లాక్కొని ప‌రార్‌

-

Attack on Couple: కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలో దారుణం జ‌రిగింది. బైక్ మీద వెళ్తున్న న‌వ దంప‌తులను టార్గెట్ చేసి..దుండ‌గులు దాడి చేశారు. వారి నుంచి మంగ‌ళ‌సూత్రం, న‌గ‌లు తీసుకుని ప‌రారయ్యారు దొంగ‌లు. ఈ ఘ‌ట‌న కాగజ్‌నగర్‌ మండలం కడంబ అభయారణ్య సమీపంలో జ‌రిగింది.

వివరాల్లోకెళ్తే.. అంజన్న, మౌనికల అనే కొత్త జంటను బైక్ మీద వెళ్తున్నారు. ఒంట‌రిగా వెళ్తున్న ఆ జంట‌ను గ‌మ‌నించారు దుండ‌గులు. దాడి కోసం అదును కోసం వారిని వెంబడించారు. ఎవ‌రూ లేని
దట్టమైన అటవీ ప్రాంతంలోకి రాగానే వారిపై తెగ‌బ‌డ్డారు. ఇనుప రాడ్డుతో విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడికి
చేశారు. బైక్ ను కూడా ధ్వంసం చేశారు. కింద‌ప‌డ్డ మౌనిక మెడ నుంచి మంగళసూత్రం, బంగారు చైన్‌ను లాక్కొని పరార్ అయ్యారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ‌.. ప్రాణభయంతో అడవిలోకి పరుగులు తీశారు ఆ బాధితులు.

కాగా, వారిని గ‌మ‌నించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయ‌ప‌డ్డ అంజన్న, మౌనికలను కాగజ్‌నగర్‌ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇరువురికి తలపై తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version