పెళ్లి వేడుక‌లో విషాదం.. బావిలో ప‌డి 13 మంది మ‌హిళ‌లు మృతి

-

పెళ్లి వేడుక‌ను చూడ‌టానికి వ‌చ్చిన 13 మంది మ‌హిళ‌లు ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి వేడుక‌కు ముందు జ‌రిగే హ‌ల్దీ ఫంక్షన్ లో ప్ర‌మాద‌వ శాత్తు బావిలో ప‌డిపోయారు. దీంతో 13 మంది మ‌హిళ‌లు మృతి చెందారు. ఈ విషాదక‌ర ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని ఖుషీ న‌గ‌ర్ లో చోటు చేసుకుంది. కాగ నెబువా నౌరాంగియాలో ప‌రేమేశ్వ‌ర్ కుష్వాహా అనే వ్య‌క్తి పెళ్లి వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. నిన్న రాత్రి స‌మ‌యంలో హ‌ల్ది కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆ ప్ర‌దేశంలోనే ఇనుప కంచె తో మూసివేసిన ఒక పాడు బ‌డ్డ బావి ఉంది. ఆ బావిపై ఈ కార్య‌క్రామాన్ని కొంత మంది నిల్చున్నారు.

బావిపై ఉన్న ఇనుప కంచె విరిగిపోవ‌డంతో దాదాపు 50 నుంచి 60 మంది ఆ పాడు బ‌డ్డ బావిలో ప‌డిపోయారు. ఈ ఆక‌స్మ‌తు ఘ‌ట‌న నుంచి తెరుకున్న త‌ర్వాత బావిలో ప‌డ్డ వారిలో కొంత మందిని బ‌య‌ట‌కు తీశారు. 13 మంది మ‌హిళ‌లు మృతి చెందారు. అలాగే చాలా మంది తీవ్రంగా గాయ ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌రలించారు. కాగ ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న‌పై యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ స్పందించారు. ఈ ఘ‌ట‌న‌లో మృతి చెందిన వారికి రూ. 4 ల‌క్షల చొప్పున ప‌రిహారాన్ని ప్ర‌కటించారు.

Read more RELATED
Recommended to you

Latest news