మనదేశంలోని ఆ గ్రామంలో హనుమంతుడి పేరు తలచినా నేరమే..కారణం ఇదేనట.!

-

హిందువులు అనేక మంది దేవుళ్లను పూజిస్తారు. ఒక్కొక్కరు ఒక్కో దేవుడిపై అపార నమ్మకంతో ఉంటారు. రామభక్తుడైనా హనుమంతుడికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి..నిత్యం పూజలు జరుగుతాయి. ఆంజనేయుడని తలుచుకుంటే..ఎలాంటి భయమైనా పోవాల్సిందే..అంత పవర్ ఫుల్ గాడ్ కదా..కానీ మనదేశంలోనే ఓ ప్రాంతంలో హనుమంతుడికి పూజించరు సరికదా అక్కడ ఆయన పేరుని కూడా పలకరట.. హనుమంతుడిని పూజించడమే వారు నేరంగా పరిగనిస్తారు. ఎందుకు వారు ఆంజనేయుడ్ని అంతలా ద్వేషిస్తున్నారు..కారణాలేంటో..తెలుసుకుందాం..!
మనకు ఈ కారణం తెలియాలంటే..రామాయణంలో ఉన్న ఈ సీన్ తెలిసి ఉండాలి..లక్ష్మణుడికి రామాయణ కాలంలో రామ రావణ యుద్ధం జరిగే సమయంలో..అప్పుడు రావణుడి తనయుడు మేఘనాథుడితో లక్ష్మణుడు యుద్ధం చేస్తున్న సమయంలో మేఘనాధుని బాణం తగిలి లక్ష్మణుడు మూర్ఛపోతాడు.. దాంతో వైద్యుడు అతని చికిత్స కోసం సంజీవని తీసుకుని రమ్మనమని సూచించాడు. ఆ తర్వాత హనుమంతుడు సంజీవని కోసం వెతుకుతూ హిమాలయ పర్వతాలలో ఉన్న ఈ ప్రదేశానికి వెళ్తాడు… హిమాలయ పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్ లోని ద్రోనగిరి ప్రాంతానికి చెందిన ఒక మహిళ సంజీవనిని ఉన్న పర్వతాన్ని ఆంజనేయస్వామికి చూపించిందని.. అయితే హనుమాన్ కు సంజీవని అర్ధం కాక మొత్తం పర్వతాన్నే ఆ గ్రామం నుంచి తనతో పాటు తీసుకుని వచ్చేస్తాడు.. మనకు ఈ స్టోరీ తెలుసు కదా..!
ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ఉన్న దునగిరి గ్రామంలోంచి సంజీవని పర్వతాన్ని ఆంజనేయుడు తీసుకెళ్లాడని ఇక్కడి ప్రజలకు కోపం..సంజీవనిని దూరం చేసిన హనుమంతుడు అంటే వీళ్లకు నచ్చదు.. ఈ గ్రామంలో హనుమంతుడికి ఒక్క గుడి కూడా లేదు.. కనీసం పేరు కూడా పలకరు.. నేటికీ, ఈ గ్రామంలో హనుమంతుని పూజించడం నేరంగా పరిగణించబడుతుంది.
రామాయణంలో హనుమంతుడు తిరిగిన ప్రాంతాలన్నింటిలో నేటికీ పూజలు జరుగుతున్నాయి..వాటిని పవిత్ర స్థలాలుగా పరిగణిస్తున్నారు.కానీ దునగిరి గ్రామంలోనే ప్రజలు ఆయనపై కోపంగా ఉన్నారు. మనం కూడా ఇప్పటివరకూ సంజీవని కోసం కొండను తెచ్చాడనే చెప్పుకున్నాం కానీ..మరి ఆ కొండ ఉన్న ప్రాంతాంలోని గ్రామ ప్రజలు ఏం అనుకుంటున్నారో అనే థాట్ కూడా మనకి వచ్చి ఉండదు..ఈరోజు తెలిసింది కదా..వాళ్లు ఎలా ఫీల్ అవుతున్నారో..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news