ఇన్ స్టా రీల్స్ చేస్తుండ‌గా రైలు ఢీ.. యువ‌కుడు మృతి

స‌ర‌దా గా వీడియో తీసి సోష‌ల్ మీడియా లో పోస్టు చేద్దామ‌నుకున్న యువ‌కుడు ప్రాణాల నే కొల్పోయాడు. మ‌ధ్య ప్ర‌దేశ్ లో ని హోశంగాబాద్ జిల్లా కు చెందిన సంజు చౌరేకీ సోష‌ల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటు అనేక పోస్టు లు, వీడియో లో చేస్తూ ఉంటాడు. అందు లో భాగం గా నే ఇన్ స్టగ్రామ్ లో రీల్స్ చేయాల‌ని భావించాడు.

ఇటార్సీ నాగ్ పూర్ మార్గంలో ఉండే రైలు ప‌ట్టాల‌పై ట్రైన్ వ‌స్తుండ‌గా వీడియో తీయాల‌ని త‌న స్నేహితునికి చెప్పాడు. సంజు ట్రైన్ ప్క‌క నుంచి వ‌స్తుంటే త‌న స్నేహితుడు వీడియో రికార్డు చేశాడు. రైలు సంజు కు స‌మీపం గా వచ్చినా.. ప‌ట్టించు కోలేదు. దీంతో సంజు ను ట్రైన్ ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న లో సంజు కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్ప‌త్రి కి త‌ర‌లించే లో గా సంజు మృతి చెందాడు. కాగ పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. అలాగే త‌న స్నేహితుడు, కుటుంబ స‌భ్యు ల వాగ్మూలం తీసుకున్నారు. కాగ ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియా మోజు లో ప‌డి ప్ర‌మాద‌క‌ర‌మైన వీడియో లో ఫోటో తీస్తూ మృతిచెందుతున్నారు.