హై కోర్ట్ ముందుకు మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డిపై పిల్ అంశం..

సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న వెంకట్రామి రెడ్డి ఇటీవల తన కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాజీనామాపై పలు విపక్షపార్టీ నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రాజీనామా అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరి.. ఎమ్మెల్యే కోటాలో వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీగా నిన్ననే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అయితే ఇటీవల కలెక్టర్ పదవికి రాజీనామా చేయడం.. ప్రభుత్వం ఆ రాజీనామాను వెనువెంటనే ఆమోదించడంపై పలువురు హైకోర్ట్ ఆశ్రయించారు. ఇటీవల రిసెర్చ్ స్కాలర్లు ఆర్. సుబేందర్ సింగ్, జే. శంకర్ లు హైకోర్ట్ లో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని( పిల్) ను ధాఖలు చేశారు. దీంతో ఈఅంశం నేడు విచారణకు రాబోతోంది. కలెక్టర్ పదవి కేంద్రం పరిధిలోకి వచ్చే అంశమని.. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ఆమోదిస్తుందని హైకోర్ట్ లో పిల్ ధాఖలు చేశారు. ఈ అంశంపై హైకోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది.