మసాజ్ ముసుగులో వ్యభిచారం..10 మంది యువతులు అరెస్టు !

మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ సెంటర్ పై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు… ఒక విటుడిని అలాగే 10 మందికి పైగా యువతులను అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో… ” ఎల్లి గంటి బ్యూటీ స్పాలోన్, అంతర్వ హమామ్ స్పా “పేర్లతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు.

అయితే ఈ మసాజ్ కేంద్రాలలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు… కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టాస్క్ ఫోర్స్ పోలీసులకు… సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి ఆ మసాజ్ సెంటర్ పై ఒక్కసారిగా దాడి చేశారు. మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక వీరుడు అలాగే పది మందికి పైగా యువతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు నిందితులను అప్పగించారు.