డ్రగ్ ఓవర్ డోస్.. ఓ యువకుడి ప్రాణం తీసింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని శివరాంపల్లికి చెందిన ఓ యువకుడు డ్రగ్ ఓవర్ డోస్ తో చనిపోయాడు. వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్న ఆ యువకుడు… గత కొంతకాలంగా గంజాయ్, కొకైన్ లాంటి డ్రగ్స్ కు అలవాటయ్యాడు. అవి లేకుంటే ఉండలేకపోయేవాడు. రోజు డ్రగ్స్ మాత్రలు తీసుకునేవాడు. రోజూలాగే శుక్రవారం కూడా డ్రగ్స్ మాత్రలు తీసుకున్నాడు. వాటి డోస్ ఎక్కువయింది. వెంటనే అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు ఆ యువకుడు. ఆ తర్వాత కొంత సేపటికే ఆ యువకుడు మృతి చెందాడు.
డ్రగ్స్ చాలా డేంజర్ అని… డ్రగ్స్ అలవాటు చేసుకోవద్దని.. ఎంత మొత్తుకుంటున్నా.. యువత డ్రగ్స్ కు బాగా అలవాటు అవుతోంది. ఈ జనరేషన్ యూత్ చిన్న విషయానికి కూడా ఒత్తిడికి లోనవుతూ ఆ ఒత్తిడిని తప్పించుకునేందుకు ఇలా డ్రగ్స్, మద్యం, సిగిరెట్ కు అలవాటు పడి తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దానికి నిదర్శనమే ఈ ఘటన.