కాకులు ఏమైపోయాయి…? అంతరించిపోతున్నాయా…?

-

ఉష్, ఉష్, లేలే… చల్… అనే పదాలు ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడా వినపడటం లేదు. కాకులను తోలడానికి మన పెద్దలు ఉపయోగించిన పదాలు అవి… వంట సామాను బయట వేయడం ఆలస్యం కాకులు వాటి చుట్టూ గుమీ గూడి ఆహారం కోసం వెతుక్కుంటూ ఉంటాయి. వాటి వలన అనారోగ్యం ఏమీ రాకపోయినా ఏదో నష్టం ఉంటుంది కాబట్టి వాటిని తోలేస్తూ ఉంటారు. అసలు ఇప్పుడు కాకులు ఉన్నాయా…? అంటే లేవనే సమాధానమే వినపడుతుంది. గతంలో కాకులు ఇళ్ల చుట్టూ గ్రామాల్లో సందడి చేస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది…

వాతావరణంలో వచ్చిన అనూహ్యమైన మార్పులు, పంట పొలాల్లో వాడుతున్న క్రిమి సంహారాలు కాకులను బలి తీసుకున్నాయి. అసలు కొన్ని గ్రామాల్లో అయితే కాకి అనేది కనపడటం లేదు. దీనితో చాలా మంది పర్యావరణ… జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకి అరుపు వింటే ఉదయానే ఒక హుషారు వస్తుందని అలాంటిది సందడి చేసే పక్షులు కనుమరుగు కావడం ఇప్పుడు బాధగా ఉందని అంటున్నారు. ఇక పొలాల్లో రైతులు దున్నే సమయంలో వెంట వెళ్లే కొంగలు కూడా కనపడటం లేదు అనేది కొందరి ఆవేదన.

రైతులు పొలం దున్నుతున్న సమయంలో పురుగులను తినేందుకు గాను కొంగలు వెంట నడుస్తూ ఉంటాయి. కానీ కొన్ని రకాల ఎరువుల కారణంగా కొంగలు ప్రాణాలు కోల్పోతున్నాయి. దీనితో పొలాల్లో సందడి కనపడటం లేదు. పంట తొలిచే పురుగులను కూడా కొంగలు తిని పంటను కాపాడుతూ ఉంటాయి. కానీ అవి కనపడకపోవడం చాలా మందిని ఆందోళనకు గురి చేస్తుంది. సెల్ టవర్ల కారణంగా ఇప్పటికే పిచుకలు, చిన్న చిన్న పక్షి జాతులు కనుమరుగు అవుతున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని ప్రజల్లో అవగాహన కల్పించాలి అని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news