గుడ్ న్యూస్‌: మ‌రో సారి పడిపోయిన ప‌సిడి ధర.. వెండి మాత్రం..

-

నిన్న‌ స్థిరంగా ఉన్న బంగారం ధ‌ర‌లు ఈ రోజు స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.39,550కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.36,250కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే, వెండి ధర మాత్రం పైకి నడిచింది. రూ.50 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,700కు చేరింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గింది. దీంతో ధర రూ.38,200కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 తగ్గుదలతో రూ.37,000కు దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,700కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news