లోన్ యాప్ కాల్ సెంటర్లలో పోలీసుల రైడ్స్.. కీలక అంశాలు వెలుగులోకి !

-

మైక్రో ఫైనాన్స్ ఆప్స్ కాల్ సెంటర్లలో పోలీసుల సోదాలు చేశారు. హర్యానాకు చెందిన మైక్రో ఫైనాన్స్ ఆప్స్ కాల్ సెంటర్లలో తనిఖీలు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులకు కళ్ళు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఎనిమిది అప్స్ కు  సంబంధించిన మూడు కాల్ సెంటర్లలో సైబర్ క్రైమ్ పోలీసులు చేశారు. గో క్యాష్, వై బ్యాంక్, క్యాష్ బి, పైసా లోన్, క్యాష్ మెను, మై బ్యాంక్, రూపీ బజార్, ఇన్ నీడ్ అప్స్ కు సంబంధించిన ఈ కాల్ సెంటర్స్ నడుస్తున్నట్టు గుర్తించారు. లోన్ యాప్స్ కి సంబంధించి హైదరాబాద్ లో రెండు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నామని ఢిల్లీ, గురుగావ్ లో కూడా కాల్ సెంటర్ పై సోదాలు చేశారు. 

మైక్రో ఫైనాన్స్ ఆప్స్ ద్వారా తీసుకున్న లోను తిరిగి చెల్లించకుంటే కాల్ సెంటర్స్ ద్వారా వేధింపులకు గురి చేస్తున్న నిర్వాహకులు S1, S2,S3 మూడు దశల్లో వేధింపులు గురిచేస్తున్నట్లు గుర్తించారు. లోన్ గడువు దాటితే తీవ్ర వేధింపులకు గుర్గావ్ లోని  s1 కాల్ సెంటర్ ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఇక హైదరబాద్ లో కూడా కొన్ని కాల్ సెంటర్ ల మీద సోదాలు చేసి కస్టమర్స్ డేటా, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలానే పిన్ ప్రింట్ టెక్నాలజీకి చెందిన మేనేజర్ మధు, అసిస్టెంట్ మేనేజర్ మనోజ్, అడ్మిన్ మహేష్, హెచ్ఆర్ శ్రీనిధిలను బేగంపేట కార్యాలయం లో అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు సీసీఎస్ కు తరలించి విచారిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version