ఈ రోజు ధరణి పై సీఎం కేసీఆర్ నిర్వహించాల్సిన సమావేశం రేపటికి వాయిదా పడింది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లలో పాత పద్ధతినే అవలంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఆధార్, ఆస్తుల వివరాల వంటి సమస్యలు ధరణి పోర్టల్‌లో పేర్కొనాలన్న నిబంధనలపై హైకోర్టులో విచారణ జరుగుతుండటం.. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం దీనిపై ఆలోచన చేస్తోంది.
నిజానికి తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్పొచ్చు. అయితే… ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. మరో వైపు కార్డు పద్ధతిలో 16 కొత్త సేవలను అందు బాటులోకి తెచ్చింది రిజిస్ట్రేషన్ల శాఖ. అలాగే, కొత్తగా 16 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది రిజిస్ట్రేషన్ల శాఖ. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ – GPA, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ GPA, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, పార్టిషన్ డీడ్, రిలీజ్ డీడ్ సేవలను రిజిస్ట్రేషన్ల శాఖ అందించనుంది.