అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం..

-

అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు అగ్రిగోల్డ్ స్కాం నిందితులు ఈడీ కస్టడికి వెళ్లనున్నారు. అగ్రిగోల్డ్ నిందితులను పది రోజుల ఈడీ కస్టడీకి ఈడీ కోర్టు అనుమతిచ్చింది. జనవరి 5వరకు కస్టడీలో ప్రశ్నించేందుకు ఈడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, వైస్ చైర్మన్ ఏవీ శేషు నారాయణ రావు, మేనేజింగ్ డైరెక్టర్ హేమ సుందర వరప్రసాద్ లను చంచల్ గూడా జైల్ నుండి ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు అధికారులు.

అగ్రి గోల్డ్ ఆస్తులను ఇప్పటికే తాత్కాలికంగా  జప్తు చేసింది ఈడీ. రూ.4109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. పలు కంపెనీల్లో వాటాలు, యంత్రాలు సైతం అటాచ్ చేసింది ఈడీ. 942.96 కోట్ల సొమ్మును ఇతర కంపెనీలకు తరలించినట్టు ఈడీ గుర్తించింది. ఏడు రాష్ట్రాల్లో 32లక్షల డిపాజిట్ల ద్వారా 6వేల 380కోట్లు సేకరించింది అగ్రిగోల్డ్ యాజమాన్యం. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు తిరిగి చెల్లించకుండా నిధుల దారి మళ్లించింది యాజమాన్యం.

Read more RELATED
Recommended to you

Exit mobile version