సాయితేజ‌కు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌

-

త‌మిళ నాడు రాష్ట్రంలో జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో… సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ తో స‌హా… ఏకంగా.. 13 మంది మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో జ‌రిగిన స‌మ‌యంలో.. 14 మంది ఆ హెలికాప్ట‌ర్ లో ప్ర‌యాణించగా..అందులో 13 మంది మ‌ర‌ణించారు. అయితే.. ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

అయితే.. ఈ వీర జ‌వాన్ సాయితేజ కు తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టించారు. వీర జ‌వాన్ సాయితేజ కుటుంబానికి ఏకంగా.. రూ. 50 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఈ మేర‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర సీఎస్ అధికారికంగా.. ప్ర‌క‌ట‌న చేశారు. జ‌వాన్ సాయి తేజ కుటుంబానికి.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎల్ల‌వేళ‌లా.. తోడు ఉంటుంద‌ని.. ఆయ‌న స్పష్టం చేశారు.  కాగా… వీర జ‌వాన్ సాయి తేజ.. అంత్య క్రియలు… ఇవాళ ఆయ‌న స్వ‌గ్రామంలో జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version