డ్రగ్స్ కు అడ్డాగా ఢిల్లీ విమానాశ్రయం..!

-

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం డ్రగ్స్ కు అడ్డాగా మారిపోయింది. మరోసారి 6 కోట్ల విలువ చేసే 357 గ్రాముల కొకైన్ ను విమానాశ్రయం లో సీజ్ చేసారు కస్టమ్స్ అధికారులు. అయితే షార్జా నుండి ఢిల్లీ కి వచ్చిన ఉగాండా కు చెందిన వ్యకి యొక్క పొట్టలో ఈ డ్రగ్స్ ను గుర్తించారు అధికారులు. సినిమాల్లో చూసిన విధంగా కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచి తరలించే యత్నం చేసాడు ఈ కేటుగాడు.

కానీ అతని పై అనుమానంతో కస్టమ్స్ అధికారులు స్క్రీనింగ్ చెయ్యగా డ్రగ్స్ రవాణా గుట్టు బయట పడింది. ఇక ఆ వ్యక్తి పొట్ట లో దాచిన కొకైన్ ను శస్త్ర చికిత్స చేసి బయటకు తీశారు వైద్యులు. అనంతరం ఆ ఉగాండా జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. అతని పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news