”మా” అధ్యక్ష అభ్యర్థి సివిఎల్ నర్శింహ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే… అంతర్జాతీయ ఫిల్మ్, టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి తెలంగాణ సినిమా కు 50 లక్షల సబ్సిడీ కూడా ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని థియేటర్లు ను చిన్న సినిమాలకు వంతుల వారిగా కేటాయింపులు చేస్తామని.. తెలంగాణ సినిమాలకు వినోద పన్ను కూడా మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారు.
షూటింగ్ లొకేషన్ ఉచితంగా కేటాయిస్తామని చెప్పిన సివిఎల్ నర్శింహ రావు.. సినిమా కార్మికుల సంక్షేమం వర్కర్స్ యాక్ట్ అమలు చేస్తామని పేర్కొన్నారు. అటు బీజేపీ నాయకులు వెంకటరమణి మాట్లాడుతూ.. మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సివిఎల్ నర్శింహ రావుకు బీజేపీ మద్దతు ఉంటుందని.. సినీ పరిశ్రమకు, కళాకారులకు బీజేపీ సహకారం చేసిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఒక్కసారి కుడా నంది అవార్డులు ఇవ్వలేదని… బీజేపీ మూడుసార్లు స్వర్ణ కమలం అవార్డ్స్ ప్రకటించిందన్నారు.. నంది అవార్డ్స్ ఎందుకు ఇవ్వడం లేదో తలసాని చెప్పాలని తెలిపారు.