షాకింగ్ : మా సభ్యత్వానికి సీవీఎల్ రాజీనామా..!

మా ఎన్నికల్లో అధ్యక్ష రేసు నుండి తప్పుకున్న సివీ ఎల్ నరసింహా రావు నిన్న సంచలన ప్రకటన చేశారు. మా ఎన్నికలు ఏకగ్రీవం అవ్వకపోతే తాను మా కు మాకు రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. అయితే చెప్పిన విధంగానే ఏకగ్రీవం కాకపోవడంతో సివిఎల్ మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సీవీఎల్ మాట్లాడుతూ… పరీక్ష రాయకుండా ముందుగానే ఫెయిల్ అయ్యానని చెప్పారు. మా ఎన్నికల్లో తాను ఓటు వేయడం లేదని స్పష్టం చేశారు.

cvl narasimha rao
cvl narasimha rao

అంతేకాకుండా బిజెపి పార్టీకి కూడా తాను రాజీనామా చేసినట్టు వెల్లడించారు. బురదలో ఉన్నా వికసించేందుకు తాను కమలం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో బీజేపీ పై కూడా సివిఎల్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సివిఎల్ తెలంగాణ వాదంతో మా ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత అనేక రాజకీయ పరిణామాల తర్వాత నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా సభ్యత్వానికి రాజీనామా చేశారు.