హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, కేపిహెచ్ బీ, మూసాపేట్ లో వర్షం కురుస్తోతంది. అదే విధంగా రాజేంద్రనగర్, అత్తాపూర్, ఉప్పరపల్లి, ఆరం ఘార్ లోనూ భారీ వర్షం కురుస్తోంది. మెహదీపట్నం, టోలి చౌకి, మాసబ్ ట్యాంక్, నాంపల్లి లోనూ కుండపోత వర్షం కురుస్తోంది. హైటెక్ సిటీ టు కేపీహెచ్బీ మార్గంలో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జాం అయ్యింది. దాదాపు రెండు కిలో మీటర్ల వరకూ వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి ట్రాఫిక్ జాం అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక వర్షం ఎక్కువగా పడుతుండటంతో జీహెచ్ ఎంసీ అధికారులు మాన్సూన్ బృందాలను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉంటే నగరంలో చినుకు పడితే చాలు భయట అడుగుపెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా భారీ వర్షం కురిసినప్పుడల్లా మనుషులు కొట్టుకుపోతున్న ఘటనలు చోటు చేసుకోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇక త్వరలోనే నగరంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మారుస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చారు.