ఆన్లైన్ మోసాలకు పాల్పడేవారు రోజురోజుకీ కొత్తదారులను వెతుకుతున్నారని ఈ సంఘటన చూస్తే తెలిసిపోతుంది. దుబాయ్ లో ఉండే ఐసీసీకి చెందిన క్రికెట్ గవర్నింగ్ బాడీకి వాళ్ళు ఆన్లైన్ మోసగాళ్లకు చిక్కారని మొన్న గురువారం వరకు కూడా తెలియదు. వారికి తెలియకుండానే నాలుగు సార్లు మొత్తం 2.5 మిలియన్ డాలర్లు కోల్పోయారు.
మోసగాళ్లు తాము ఐసిసి వెండర్ అని వారిని నమ్మించాడు. అందుకే ఐసీసీతో సంప్రదింపులు జరిపే ఇ-మెయిల్ కి దగ్గరగా ఉండేలా ఓ ఫేక్ ఇ-మెయిల్ క్రియేట్ చేశారు. దాని ద్వారా వాళ్ళు అమెరికాకు చెందిన వెండర్ గా ఐసీసీ కార్యాలయాన్ని నమ్మించాడు. అలా తమకు రావాల్సిన బాధ్యతలు క్లియర్ చేయాలంటూ మెయిల్స్ పెట్టారు.అలా నాలుగు సార్లు మెయిల్ చేసి దాదాపు రూ.20 కోట్ల వరకు కాజేసినట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై మాత్రం ఐసిసి ఎక్కడ అధికారికంగా స్పందించలేదు. కానీ, దర్యాప్తు కూడా జరుగుతున్నట్లు చెబుతున్నారు.