Breaking : ‘RCB’ ట్విటర్ అకౌంట్ హ్యాక్

-

‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’ అధికారిక ట్విటర్ అకౌంట్ మరోసారి హ్యాక్ అయింది. గుర్తు తెలియని వ్యక్తులు RCB ట్విటర్ హ్యాండిల్ను హ్యాక్ చేసి ‘Bored Ape Yacht Club’గా మార్చారు. అకౌంట్లో సంబంధం లేని పోస్ట్లు చేస్తున్నారు. అకౌంట్ను తిరిగి ఆధీనంలోకి తీసుకునేందుకు RCB టీమ్ శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. 2021 సెప్టెంబర్లోనూ RCB ట్విటర్ అకౌంట్ను హ్యాక్ చేశారు.

 

గతంలో కూడా.. ఆర్‌సిబి అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆర్‌సిబి ట్విటర్ హ్యాండిల్‌ను హ్యాక్ చేసి సంబంధం లేని పోస్ట్‌లు చేశాడు. టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ను విమర్శిస్తున్నట్లు ఆయా ట్విటర్ ఖాతా నుంచి ఓ ట్వీట్ ప్రత్యక్షమయ్యింది. అప్పుడా ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఎలాన్ మస్క్ తాను పెంచుకుంటున్న కొత్త కుక్కపిల్లను పరిచయం చేస్తూ చేసిన ట్వీట్‌కు.. ఆర్‌సిబి ఖాతాతో విమర్శిస్తూ కామెంట్ వచ్చింది. ‘ఫ్లోకి వచ్చేసింది‘ అంటూ తన కుక్కపిల్ల ఫొటోను మస్క్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

దీనిపై ఆర్‌సిబి స్పందిస్తూ.. ‘2020లో టెస్లా ద్వారా పర్యావరణ పరిరక్షణ పేరుతో దాదాపుగా రూ.11.05 వేల కోట్ల(1.5 బిలియన్ డాలర్లు) సబ్సీడీని పొందిన మస్క్.. ఇప్పుడదే మొత్తాన్ని బిట్‌కాయిన్‌పై పెట్టుబడి పెట్టారు’ అంటూ ఆర్‌సీబీ ఖాతా నుంచి కామెంట్ వచ్చింది. అలా చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఫ్రాంఛైజీ.. జట్టుకు సంబంధించిన అధికారిక ఖాతా హ్యాక్ అయిందని ఆరోపించింది. వెంటనే దానికి సంబంధించిన కామెంట్‌నూ తొలగించింది. మస్క్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్‌ను తాము ఖండిస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాత వెంటనే తమ ఖాతాను ఫ్రాంఛైజీ అధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version