ఒకప్పుడు తెలుగు సినిమాల లో తన గ్లామర్ తో ఒక ఊపు ఊపిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. మంచి ఫిట్నెస్ ట్రైనర్ లాగా ఉండే రకుల్ ఒంపుసొంపులు ఎలా ఉండాలో పక్కాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సినిమాల్లో కూడా అంతే ఎనర్జీ తో గ్లామర్ తో మాయ చేస్తూ ఉంటుంది. అప్పట్లో చాలా మంది టాప్ లెవెల్ హీరోలు అందరూ రకుల్ ను తీసుకోవడానిే ఇంట్రెస్ట్ చూపించారు.
అయితే, తాజాగా తన కెరీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది రకుల్. కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలు పడ్డానని హీరోయిన్ రకుల్ ప్రీత్ వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘ఇండస్ట్రీలో నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు. ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారేది. చాలా సార్లు నాతో షూటింగ్ చేసి చివరికి వేరే హీరోయిన్ ను తీసుకునేవారు. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాను కాబట్టే ఈ స్థాయికి చేరుకున్నాను. ఇదంతా పోరాటం అనుకోవట్లేదు. ఏదైనా ఈజీగా దక్కాలనుకునే మనస్తత్వం నాది కాదు’ అని పేర్కొంది రకుల్ ప్రీత్ సింగ్.