కొంప ముంచుతున్న ఓటీపీ…!

-

హైదరాబాద్ లో సైబర్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఫోన్ చేసి… బ్యాంకులు సేవా కేంద్రాల ఆఫీసుల నుంచి ఫోన్లు చేస్తున్నారు. దీనిపై రోజు రోజుకి ఫిర్యాదులు నమోదు అవుతూనే ఉన్నాయి. రహ్మత్‌నగర్‌కు చెదిన ఓ వ్యక్తి గూగుల్‌పే యాప్‌ ద్వారా మొబైల్‌ రీఛార్జ్‌ చేయగా… అది సాంకేతిక లోపం కారణంగా పూర్తి అవ్వలేదు. దాని గురించి తెలుసుకోవడానికి గాను సేవా కేంద్రానికి ఫోన్ చేసాడు. ఆ నెంబర్ కోసం గూగుల్ లో వెతికాడు.

ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన నంబర్‌కు ఫోన్‌ చేయగా… మీరు కోల్పోయిన నగదు రిఫండ్‌ చేస్తానని చెప్పడంతో ఫోన్ కి వచ్చియా ఓటీపీ చెప్పాలని అనడం తో నెంబర్ చెప్పగా… బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.99 వేలు మాయం కావడం తో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మెహదీపట్నంకి చెందిన వ్యక్తికి మీ పేటీఎం ఖాతా రద్దు అయిందని రీఓపెన్ చేసుకోవాలని ఫోన్ వచ్చింది. ఇలాగే ఓటీపీ చెప్పాలని సూచించాడు.

చెప్పిన వెంటనే బాధితుడు ఓటీపీ చెప్పగా ఖాతాలో ఉన్న రూ.79 వేలు పోయాయి. బంజారాహిల్స్‌కు చెందిన ఒక వ్యక్తికి ప్రముఖ మొబైల్ యాప్ పేటీఎం కేవైసీ చేయాలని సైబర్‌ నేరస్థులు ఫోన్‌ చేయగా పేటీఎం ప్రతినిధులు అనుకుని చెప్పాడు. దీనితో ఎకౌంటు లో ఉన్న రూ.89 వేలు పోయాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా సరే మారడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news