Business Ideas : వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్ బిజినెస్‌తో.. చ‌క్క‌ని ఆదాయం..!

-

స్వ‌యం ఉపాధి క‌ల్పించుకుని డ‌బ్బు సంపాదించాల‌నుకునే వారికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని వ్యాపారాల గురించి నిజానికి చాలా మందికి తెలియ‌దు. అవును.. అలాంటి బిజినెస్‌ల‌లో.. ఫ్యాబ్రిక్ రీసైక్లింగ్ (వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్‌) బిజినెస్ కూడా ఒక‌టి. దీనికి త‌క్కువ పెట్టుబ‌డి పెడితే చాలు.. పెద్ద ఎత్తున డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు. ఇక కొద్దిగా మార్కెటింగ్ చేసుకోగ‌లిగే ఓపిక ఉంటే.. ఈ బిజినెస్‌లో చాలా లాభాలు పొంద‌వ‌చ్చు. మ‌రి ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుందో.. దీంట్లో ఎంత మొత్తం ఆదాయం ల‌భిస్తుందో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

earn in thousands through waste cloth recycling business

 

వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్ బిజినెస్‌కు రెండు ర‌కాల మెషిన్ల‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక‌టి.. వేస్ట్ క్లాత్ గ్రైండింగ్ మెషిన్‌.. దీని సాధార‌ణ మోడ‌ల్ ఖ‌రీదు రూ.80వేల వ‌ర‌కు ఉంటుంది. ఇక హ్యాండ్ లేదా ఆటోమేటిక్ హైడ్రాలిక్ ప్రెస్‌.. వీటి ఖ‌రీదు రూ.30వేలు మొద‌లుకొని రూ.2.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. ఇక ఈ బిజినెస్‌కు ముడి ప‌దార్థం.. అంటే.. ఉప‌యోగించని దుస్తులే. అలాగే వాడి ప‌డేసిన బెడ్ షీట్లు, ఫ‌ర్నిచ‌ర్ షీట్లు, క‌వ‌ర్లు, టైల‌ర్స్ క‌ట్ చేయ‌గా మిగిలే క్లాత్‌, రెడీ మేడ్ గార్మెంట్ల‌లో ఉత్ప‌త్తి అయ్యే క్లాత్ వ్య‌ర్థాలు, ఇండ‌స్ట్రియ‌ల్ ఫ్యాబ్రిక్ వేస్ట్‌.. త‌దిత‌ర వ‌స్త్రాల‌ను ముడి ప‌దార్థాలుగా ఉప‌యోంచ‌వ‌చ్చు. అయితే వేస్ట్ క్లాత్ కావాలంటే ఇండియా మార్ట్ వంటి వెబ్‌సైట్‌లోనూ కేజీకి రూ.15 నుంచి రూ.40 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. ఆ క్లాత్‌ను కూడా కొనుగోలు చేయ‌వ‌చ్చు. క్లాత్ క్వాలిటీ, ర‌కాన్ని బ‌ట్టి ఆ ఖ‌రీదు ఉంటుంది.

ఇక వేస్ట్ క్లాత్‌ను గ్రైండింగ్ మెషిన్ లో వేయ‌గానే.. అది చిన్న చిన్న ముక్కలుగా క‌ట్ అయి బ‌య‌ట‌కు వ‌స్తుంది. అనంత‌రం దాన్ని హైడ్రాలిక్ ప్రెస్ కింద ఉంచి ప్రెస్ చేసి ఆ త‌రువాత ప్యాక్ చేయాలి. ఆ ప్యాక్‌లలోని రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్‌ను కేజీకి దాదాపుగా రూ.75 నుంచి రూ.95 వ‌ర‌కు విక్ర‌యించ‌వ‌చ్చు. అయితే ఆటోమేటిక్ హైడ్రాలిక్ ప్రెస్ అయితే ప‌ని వేగంగా జ‌రుగుతుంది. ఎక్కువ మొత్తంలో రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్‌ను ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చు.

ఇక ఈ బిజినెస్‌ను ఇండ్ల‌లో చేస్తే.. అందుకు ఎలాంటి అనుమ‌తులు అవ‌స‌రం లేదు. కానీ షెడ్ల‌లో చేయాల‌నుకుంటే.. అందుకు కొన్ని అనుమ‌తులు పొందాలి. జీఎస్‌టీ నంబ‌ర్, ట్రేడ్ లైసెన్స్‌, లోక‌ల్ అథారిటీ ప‌ర్మిష‌న్‌, రాష్ట్ర పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమ‌తి పొందాల్సి ఉంటుంది. ఆ త‌రువాత పెద్ద ఎత్తున ఈ వ్యాపారం చేయ‌వ‌చ్చు. ఇండ్ల‌లో రూ.2 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో ఈ వ్యాపారం ప్రారంభించ‌వ‌చ్చు.

ఈ బిజినెస్ ద్వారా నెల‌కు రూ.వేల‌ల్లో సంపాదించేందుకు అవ‌కాశం ఉంటుంది. వేస్ట్ క్లాత్‌ను యావ‌రేజ్‌గా కేజీకి రూ.30కి కొనుగోలు చేసినా.. రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్‌ను యావ‌రేజ్‌గా కేజీకి రూ.85కి అమ్మితే.. అప్పుడు కేజీకి దాదాపుగా రూ.55 వ‌ర‌కు లాభం ఉంటుంది. ఈ క్ర‌మంలో నిత్యం 100 కేజీల వ‌ర‌కు రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్‌ను ఉత్ప‌త్తి చేసి అమ్మినా.. రోజుకు రూ.5500 వ‌ర‌కు వ‌స్తుంది. అదే నెల‌కు లెక్క‌వేస్తే.. 30 * 5500 = రూ.1,65,000 అవుతుంది. అందులోంచి లేబ‌ర్ ఖ‌ర్చు, ప్యాకింగ్‌, విద్యుత్‌, ర‌వాణా ఖ‌ర్చులు రూ.70వేల‌కు తీసేస్తే… రూ.95వేలు అవుతుంది. ఈ క్ర‌మంలో నెల‌కు అంత మొత్తంలో లాభం సంపాదించ‌వచ్చు.

అయితే ఉత్ప‌త్తి చేసిన రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్‌ను బొమ్మ‌ల త‌యారీ ప‌రిశ్ర‌మ‌ల‌కు, కార్పెట్ల త‌యారీదారుల‌కు, డోర్ మ్యాట్ల‌ను త‌యారు చేసేవారికి, క్రీడా సామ‌గ్రి త‌యారు చేసేవారికి, బెడ్‌రోల్స్ త‌యారీదారుల‌కు, మెషిన్ల క్లీనింగ్ క్లాత్‌ను త‌యారు చేసే వారికి అమ్మాల్సి ఉంటుంది. అందుకు గాను ఆయా సంస్థ‌లు, ప‌రిశ్ర‌మ‌ల‌తో ఒప్పందాలు చేసుకుంటే.. ఈ బిజినెస్‌లో సుదీర్ఘ కాలం పాటు కొన‌సాగి.. లాభాల‌ను గ‌డించేందుకు అవ‌కాశం ఉంటుంది..!

Read more RELATED
Recommended to you

Latest news