ఒక్క తుఫాన్ కారణంగా భారత్ కు 14 బిలియన్ డాలర్ల ఆర్ధిక నష్టం: ప్రపంచ నివేదిక

-

ఈ ఏడాది మేలో భారత-బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న సుందర్‌ బన్ లో తీరం దాటిన అంఫాన్ తుఫాన్ కారణంగా భారత్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో 14 బిలియన్ డాలర్ల ఆర్ధిక నష్టం జరిగింది అని ఒక నివేదిక పేర్కొంది. సూపర్ తుఫాను ఉత్తర హిందూ మహాసముద్రం ఏర్పడింది. అత్యంత ఖరీదైన తుఫాను గా పేర్కొన్నారు. గ్లోబల్ క్లైమేట్ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాత్కాలిక నివేదిక బుధవారం విడుదల చేసింది.

ఈ నివేదికలో తుఫాన్ నష్టాలను వెల్లడించింది. భారతదేశం మరియు బంగ్లాదేశ్ తీర ప్రాంతాలలో ఊహించని ఆర్ధిక నష్టం జరిగింది అని వెల్లడించింది. భారతదేశంలో, ప్రధానంగా పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాలో, మరియు బంగ్లాదేశ్లో 2.5 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. 2.8 మిలియన్లకు పైగా గృహాలకు నష్టం వాటిల్లింది. ఈ తుఫాన్ లో 129 మంది మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news