తుకడే తుకడే గ్యాంగ్ ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తుంది: బిజెపి ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

-

తుకడే-తుకడే గ్యాంగ్ దేశ దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన చేస్తుంది అని ఢిల్లీ బిజెపి ఎంపీ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీ సరిహద్దులను షాహీన్ బాగ్‌ గా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఈ ఏడాది ప్రారంభంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్ లో పెద్ద ఎత్తున హింస జరిగింది. ఖిలిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

రైతుల్లో ఉన్న కొంత మంది ప్రధాన మంత్రిని బెదిరిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. “షాహీన్ బాగ్ వద్ద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) మరియు సిఎఎలను వ్యతిరేకించిన వ్యక్తులు మరియు సమూహాల ఉనికి స్పష్టంగా అక్కడ కనపడుతుంది అని ఆయన ఆరోపించారు. రైతుల నిరసనలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానా, యుపి మరియు ఇతర రాష్ట్రాల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news