హైదరాబాద్ నగరంలోని నానక్ రామ్ గూడ లో ఈ రోజు తెల్ల వారు జామున దారుణం చోటు చేసుకుంది. నానక్ రామ్ గూడ లో ఈ రోజు ఉదయం ఐదు గంటల కు సిలిండర్ బ్లాస్ట్ అయింది. ఒకే సిలిండర్ కు మూడు కనెక్షన్స్ ఉండటం తో నే ప్రమాదం తీవ్రత పెరిగింది. ఒక కనెక్షన్ నుంచి ముందుగా లీకేజ్ జరిగింది.
దీంతో ప్రమాదం సంభవించింది. కాగ ప్రమాదం జరిగిన భవనంలో సుమారు 50 మంది నివాసం ఉంటున్నారు. అయితే ప్రమాదం సంభవించిన భవనంలో నివసిస్తున్న యూపీ తో పాటు బీహార్ రాష్ట్రాల కు చెందిన కార్మికులు ఉన్నారు. ఈ బ్లాస్ట్ ఘటన లో ఇప్పటి వరకు దాదాపు 11 మంది కి గాయాలు అయినట్లు గుర్తించారు. మిగితా వారిని ప్రమాదం జరిగిన భవనం ఖాళీ చేయిస్తు న్నారు. అలాగే వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. కాగ భవనంలో ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూలుస్తున్నారు.