ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు తోడల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆదివారం వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. గత కొద్ది రోజులుగా పురందేశ్వరి భాజపాకు రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలకు దగ్గుబాటి – జగన్ ల భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు గత కొద్ది రోజులుగా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి దగ్గుబాటి కుమారుడు హితేష్‌ను వైసీపీ నుంచి బరిలోకి దింపాలని బావిస్తున్న నేపథ్యంలో జగన్‌తో ఈ విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.
అమెరికా పౌరసత్వం ఉన్న హితేష్ రాజకీయాలపై ఆసక్తితో ఇక్కడే ఉంటున్నారు. అయితే అటు భాజపాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న పురందేశ్వరి సైతం వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.