అత్యంత వేగంగా వెళ్లే ట్రెయిన్ పేరు మార్చారు.. ఇక నుంచి ‘ట్రెయిన్ 18’ కాదు..!

-

ట్రెయిన్ 18 తెలుసు కదా. భారతదేశంలోనే అత్యంత వేగంగా వెళ్లే రైలు.. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ ట్రెయిన్‌కు ఇంజిన్ ఉండదు. ఢిల్లీ, వారణాసి మధ్య తిరగనున్న ఈ ట్రెయిన్ పేరును వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ట్రెయిన్ పేరును వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చినట్టు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో కేవలం 18 నెలల్లోనే ఈ ట్రెయిన్‌ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. మొత్తం 16 ఏసీ కోచ్‌లతో ఉండే ఈ ట్రెయిన్ కాన్పూర్, అలహాబాద్‌లో మాత్రమే ఆగుతుంది. శతాబ్దీ ట్రెయిన్ల కన్నా ఫాస్ట్‌గా వెళ్లడమే కాదు.. అత్యాధునిక సౌకర్యాలు ఈ ట్రెయిన్ సొంతం. ఢిల్లీ నుంచి వారణాసి మధ్య 755 కిలోమీటర్లు ఉండగా… ఈ ట్రెయిన్ కేవలం 8 గంటల్లోనే వెళ్తుంది. అందుకే ఈ ట్రెయిన్‌కు అత్యంత వేగంగా వెళ్లే ట్రెయిన్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఉన్న రైళ్లు ఢిల్లీ నుంచి వారణాసికి 11 నుంచి 12 గంటల్లో వెళ్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version