Aranya: ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న రానా ‘అరణ్య’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

-

Aranya: వినూత్న క‌థ‌లు, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న‌ న‌టుడు రానా ద‌గ్గుపాటి. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘అర‌ణ్య‌’. ప్ర‌భు సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఏడాది మార్చి 26న విడుద‌లైంది. కానీ క‌రోనా ప‌రిస్థితుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డంతో బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాన్ని వ‌చ్చాయి.

అయితే.. ఈ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని మూవీ మేక‌ర్స్ భావించారు. అనుకున్న‌దే త‌డువ‌గా .. ద‌స‌రా కానుకా అక్టోబ‌ర్ 15 నుంచి జీ5 వేదికగా ‘అరణ్య’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ రోజు అర్థ‌రాత్రి నుంచి ఓటీటీలో అందుబాటులోనికి రానున్న‌ది. థియేట‌ర్స్‌లో మిస్ అయినా వాళ్లు ఎంచ‌క్కా ఫోన్‌లోనే చూసేయొచ్చు.

ఈ సినిమాలో విష్ణు విశాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. శ్రియ, జోయా హుస్సేన్‌లు ప్రముఖ పాత్రల్లో కన్పించనున్నారు. ఈ చిత్రానికి శాంతను సంగీతం అందించారు. ఏరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై
ఈ చిత్రాన్ని నిర్మించారు. విశాఖపట్నం సమీపంలోని చిలకలకోన అడవి. అక్కడ తరతరాలుగా ఏనుగుల్ని రక్షించే కుటుంబంలో పుట్టి పెరుగుతాడు హీరో న‌రేంద్ర ‌భూప‌తి (రానా). ఏనుగుల రక్షణ కోసం కృషి చేసినందుకు గానూ.. ఆయ‌నకు ఫారెస్ట్ మేన్‌గా రాష్ట్రపతి అవార్డు సాధిస్తాడు.

అదే సమయంలో కేంద్రమంత్రి క‌న‌క‌మేడ‌ల రాజ‌గోపాలం (అనంత్ మ‌హ‌దేవ‌న్‌) చిల‌క‌ల‌కోన అడవిపై కన్నేస్తాడు. అట‌విని న‌రికి .. అక్క‌డ టౌన్‌షిప్ కట్టేందుకు ప్లాన్ చేస్తాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప్రాజెక్టుకు అడ్డంకిగా ఉన్న‌ ఏనుగులు అంతం చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఎనుగులు నీటి కోసం వెళ్లే అటవీ ప్రాంతంలో కూడా గోడ కట్టేస్తాడు. ఈ క్రమంలో కేంద్రమంత్రిపై ఎలా పోరాటం చేశారు?అడ‌విని ఎలా దక్కించుకున్నారన్నది కథ.

Read more RELATED
Recommended to you

Exit mobile version