డాకు మహారాజ్ వచ్చేది ఈ ఓటీటీలోనే..!

-

గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. థియేటర్లలో ఈ చిత్రానని వీక్షించేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య డైలాగ్ లు, యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ గా నిలిచాయి.

Daaku Maharaaj

ముఖ్యంగా బాలకృష్ణ-బాబీ డియోల్ మధ్య యాక్షన్స్ వండర్స్ అనే చెప్పవచ్చు. వీటిని థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మరోవైపు టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం విశేషం. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే 4 నుంచి 8 వారాల్లో ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి. డైరెక్టర్ బాబీ బెస్ట్ చిత్రాల్లో డాకు మహారాజ్ ఒకటిగా నిలుస్తుందనడటంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పవచ్చు. 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version