క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఫాస్ట్ బౌలర్

దక్షిణాఫ్రికా లెజెండరీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ తన క్రికెట్ కెరీర్‌ కు ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు. ఈ ఫాస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌… తన అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను వైదొలుగుతున్నట్లు డేల్‌ స్టెయిన్‌ ప్రకటించాడు. కాసేపటి క్రితమే… తన ట్విట్టర్‌ వేదికగా… ఈ విషయాన్ని ప్రకటించాడు డేల్‌ స్టెయిన్‌.

20 సంవత్సరాలు గా తన క్రికెట్‌ ప్రయాణం సాగిందని… ఈ అద్బుత ప్రయాణం లో తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు అంటూ డేల్‌ స్టెయిన్‌ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. 38 ఏళ్ల స్టెయిన్‌ తన కెరీర్‌ లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ 20 లు ఆడాడు డేల్‌ స్టెయిన్‌. ఐపీఎల్‌ లోనూ డేల్‌ స్టెయిన్‌ ఆడి… మంచి పేరు తెచ్చుకున్నాడు. అద్భుతమైన బంతులతో బ్యాట్స్‌ మెన్ ను ముప్ప తిప్పలు పెట్టేవాడు డేల్‌ స్టెయిన్‌. ఇక డేల్‌ స్టెయిన్‌ తాజా నిర్ణయం పై సౌతాఫ్రికా క్రికెట్‌ టీం విచారం వ్యక్తం చేసింది.