తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా… దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చింది. దళిత బంధు పథకం ద్వారా… ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ దళిత బంధు పథకాన్ని… హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది టిఆర్ఎస్ పార్టీ. అయితే… హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో దళిత బంధు పథకానికి బ్రేక్ వేసింది ఎన్నికల కమిషన్.
ప్రతి పక్ష నేతలు ఇచ్చిన లేఖ,ఓటర్లు ప్రభావితం కాకూడదనే తరుణంలో దళిత బంధు పథకాన్ని అన్ని ఆఫ్ చేస్తున్నామని ప్రకటించింది ఎన్నికల కమిషన్. దీంతో హుజరాబాద్ నియోజకవర్గం లోని దళిత సంఘం నేతలు మరియు కొంతమంది దళితులు… మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈటల రాజేందర్ ఇచ్చిన లేఖ కారణంగానే దళిత బందు పథకం అమలు ఆగిపోయింది అంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ని హుజూరాబాద్ నియోజకవర్గం లోని ఇల్లంతకుంట గ్రామంలో ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈటల రాజేందర్ ను ఎన్నికల ఓడిస్తాం అంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. ఈటల ను ఓడించేందుకు దళితులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.