కివీస్ కు ఊరట, ఆస్ట్రేలియా డేంజరస్ ప్లేయర్ వార్నర్ అవుట్ !

-

ప్రస్తుతం వరల్డ్ కప్ షెడ్యూల్ లో భాగంగా ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ తో వరల్డ్ కప్ లో మొదట మ్యాచ్ ఆడుతున్న ట్రావిస్ హెడ్ వార్నర్ తో కలిసి కివీస్ బౌలింగ్ ను తుత్తునియలు చేశారు. ఇద్దరూ ఆది నుండి బౌండరీల వర్షం కురిపించారు.. పడిన బంతిని పడినట్లే స్టాండ్స్ లోకి పంపిస్తూ పరుగుల సునామీని సృష్టించారు.. ఈ దశలో వార్నర్ మరియు హెడ్ లు అర్ద సెంచరీ లను పూర్తి చేసుకున్నారు. వార్నర్ ముఖ్యంగా చూడచక్కని షాట్ లతో అలరిస్తూ సెంచరీ కి చేరువ అవుతున్న సమయంలో పార్ట్ టైం స్పిన్నర్ గ్లేన్ ఫిలిప్స్ వచ్చి మంచి బంతితో వార్నర్ ను బోల్తా కొట్టించి రిటర్న్ క్యాచ్ గా అవుట్ చేశాడు.

దీనితో కివీస్ కు కాస్త ఊరట దక్కింది.. వార్నర్ 65 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సులతో 81 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news