శ్రీవారి భక్తులకు షాక్‌..వైకుంఠ ద్వార దర్శన టోకెన్‌ కౌంటర్ల కుదింపు

-

తిరుమల శ్రీవారి భక్తులకు షాక్‌ తగిలింది. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్‌ కౌంటర్లపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి వైకుంఠ ద్వార దర్శన టోకెన్‌ కౌంటర్లను కుదింపు చేస్తూ టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.

నాలుగు ప్రాంతాల్లో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది టీటీడీ. అలిపిరి, శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజు సత్రాల వద్ద టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇక ఈ విషయం దృష్టిలో పెట్టుకుని, తిరుమల రావాలని టీటీడీ పేర్కొంది.

కాగా, టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనంత హుండీ ఆదాయం సమకూరింది. వైకుంఠ ఏకాదశి కావడంతో దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించారు. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమలలో భక్తులు హుండీలలో స్వామి వారికి సమర్పించిన కానుకలను లెక్కించగా ఏకంగా రూ. 7.68 కోట్లు వచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news