అమెరికా అధ్యక్ష పీఠం బైడన్ దే…!

-

అమెరికా అధ్యక్ష పీఠాన్ని డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఎట్టకేలకు కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా జో విస్కాన్సిన్, మిచిగాన్ రాష్ట్రాలు బైడెన్ ఖాతాలో చేరడంతో.. ఆయన మొత్తంగా 253 ఎలక్టోరల్ ఓట్లను గెలుపొందారు. మరోపక్క ట్రంప్ 214 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. అయితే మరో ఆరు రాష్ట్రాల ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ఆరు రాష్ట్రాల్లో అరిజోనా, నెవాడాలలో జో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 17 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో జో బైడెన్ ఆధిక్యంలో ఉండటంతో విజయం దాదాపు ఖాయం..దీంతో మ్యాజిక్ ఫిగర్ 270కు జో బైడెన్ చేరుకుంటారు.


మిచిగాన్‌లో ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. వేల బ్యాలెట్లను లెక్కించాల్సి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఓట్ల లెక్కింపు తర్వాత జో బైడెన్ మెజారిటీ మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని డెమొక్రాట్లు అభిప్రాయపడుతున్నారు. ఇంకా కేవలం ఆరు రాష్ట్రాల ఫలితాలు మాత్రమే రావాల్సి ఉంది. వెలువడాల్సిన ఫలితాల్లో అరిజోనా కూడా ఒకటి. మొత్తం 11 ఎలక్టోరల్ ఓట్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అరిజోనాలో జో బైడెన్ ట్రంప్‌పై 3.4 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. . నార్త్ కరోలినా, పెన్సిల్‌వేనియా, జార్జియా, అలాస్కా రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version