ఐపీఎల్ 2022లో ఈ రోజు డబల్ ధమాకా.. లో మొదట జరిగిన మ్యాచ్ లో కోల్‌కత్త నైట్ రైడర్స్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగంలో కోల్‌కత్త నైట్ రైడర్స్ జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చిత్తు చేసింది. కోల్‌కత్తను ఆలౌట్ చేసి విజయాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో కోల్ కత్తపై ఢిల్లీ 44 పరుగుల తేడాతో విక్టరీని నమోదు చేసింది. కోల్‌కత్త ముందు ఉన్న 216 భారీ లక్ష్యాన్ని చేధించడంలో విఫలం అయింది. 171 పరుగుల వద్ద కోల్‌కత్త ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీ ఖాతాలో మరో విజయం నమోదు అయింది.
కాగ ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. ఓపెనర్లు.. పృథ్వీ షా (51), వార్నర్ ( 61 ) తో శుభారంభాన్ని ఇచ్చారు. వీరు తొలి వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత రిషబ్ పంత్ (14 బంతుల్లో 27), అక్షర్ పటేల్ (14 బంతుల్లో 22 నాటౌట్), శార్ధుల్ ఠాకూర్ (11 బంతుల్లో 29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కాగ కోల్‌కత్త నైట్ రైడర్స్.. శ్రేయస్ అయ్యార్ (54), నితీష్ రానా (30) తప్ప అందరూ విఫలం అయ్యారు. కాగ ఢిల్లీ బౌలర్లు.. కుల్దీప్ యాదవ్ 4, ఖలీల్ అహ్మద్ 3, శార్ధుల్ ఠాకూర్ 2, లలిత్ యాదవ్ ఒక వికెట్ తీశారు.