మళ్ళీ క్రికెట్ లోకి డివిలియర్స్…?

-

తన దూకుడైన ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఏబీ 2018 లో అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అయితే అతను చిన్న వయసులో తప్పుకోవడం తో మళ్ళీ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు.

స్టార్ స్పోర్ట్స్ షో ‘క్రికెట్ కనెక్టెడ్’, ఒక ప్రకటనలో ఏబీ ని మళ్ళీ జాతీయ జట్టుకు ఆడాలని క్రికెట్ సౌత్ ఆఫ్రికా కోరింది అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏబీకి 36 ఏళ్ళు కాగా అతను ఐపిఎల్ కి ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అతనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సంగతి తెలిసిందే. 114 టెస్టులు, 228 వన్డేలు మరియు 78 టి 20 లు ఆడాడు. తాజాగా అతను కీలక వ్యాఖ్యలు చేసాడు. తన అవసరం జట్టుకు ఉంటే తిరిగి వస్తా అని చెప్పాడు.

నేను టాప్ ఫామ్‌లో ఉండాల్సిన అవసరం ఉంది. నేను జట్టులో నా స్థానానికి అర్హుడని భావిస్తే, నేను ఆడటం చాలా సులువు అవుతుందని చెప్పుకొచ్చాడు. గత కొన్ని రోజులుగా తనను క్రికెట్ లోకి తిరిగి రావాలని పలువురు కోరుతున్నారని ఏబీ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాలో జరగబోయే టి 20 ప్రపంచ కప్ కోసం డివిలియర్స్ జాతీయ జట్టులో తీసుకునే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ చెప్పుకొచ్చాడు. అయితే ఫాం లో ఉంటేనే అని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news