ఆఫ్రికా ఖండంలోని కాంగోలో దేశంలో ఘోర ప్రమాదం సంభవించింది. సముద్రం ప్రయాణంలో అనుకోకుండా పడవలో మంటలు చెలరేగాయి. దీంతో ప్యాసింజర్స్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నెమ్మదిగా మంటలు పడవ మొత్తం వ్యాపించగా.. అందులో గందరగోళం నెలకొంది.
ఈ క్రమంలోనే పడవ సముద్రంలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా మృతి చెందగా.. వందల మంది గల్లంతు అయ్యారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ దేశంలోని ఎంబాండకా పట్టణానికి సమీపంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.ఈ ఘటనపై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.