డిసెంబర్‌ 06 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

డిసెంబర్‌- 6- కార్తీకమాసం- ఆదివారం.

మేషరాశి: ఈరోజు ప్రతికూల ఫలితాలు !

ఈరోజు కొత్త ఆలోచనలు చేయకండి. ప్రతికూలమైన రోజు. ఈరోజు ఆఫీస్‌లో అధికారులు, సహచరులు మీకు సహకరిస్తారు. కొత్త ప్రాజెక్టు విజయవంతమవుతుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి మాటలు మిమ్మల్ని బాధిస్తాయి.
పరిహారాలుః శ్రీసూర్యారాధన చేయండి.

todays horoscope

వృషభరాశి: ఈరోజు పెండింగ్‌ పనులను పూర్తిచేయండి !

ఈరోజు ఇతరుల మాటలను పట్టించుకోని పెట్టుబడులు పెట్టకండి. దీనివల్ల నష్టపోయే అవకాశముంది. కుటుంబ సభ్యు ల పెండింగ్ పనులు పని పూర్తి చేస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారలకు మంచి లాభాలు వస్తాయి. ఆఫీస్లో మార్పుచేర్పులకు అవకాశం ఉంది. వైవాహికంగా బాగుంటుంది.
పరిహారాలుః శ్రీశివాభిషేకంతోపాటు అన్నదానం నిర్వహించండి.

మిథునరాశి: ఈరోజు వ్యాపారంలో లాభాలు !

వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఈ రోజు మీ పనికి ఆటంకాలు కలగవచ్చు. కానీ మీరు పనిపై దృష్టి పెట్టి వాటిని అధిగమిస్తారు. మీ కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.. కుటుంబ జీవితం సుఖంగా ఉంటుంది.
పరిహారాలుః శ్రీకుజగ్రహారాధన చేయండి మంచి ఫలితం వస్తుంది.

కర్కాటకరాశి: ఈరోజు కుటుంబంలో సంతోష వాతావరణం !

ఈరోజు మీకు గౌరవ ప్రతిష్ఠలు వస్తాయి. మీ కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తే అవకాశాలు వస్తాయి. దీనివల్ల మీకు భవిష్యత్‌లో ప్రయోజనం చేకూరుతుంది. సోదరీ, సోదరుల సహకారం వ్యాపారాన్ని పెంచుతుంది. మీ కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.
పరిహారాలుః శ్రీశివాష్టకం పారాయణం చేయండి.

సింహరాశి: ఈరోజు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి !

ఈరోజు మీ వృత్తిలో పెరుగుదల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ ఇంట్లో సంతోషం వాతావరణం ఉంటుంది. భవిష్యత్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి పెద్దల గైడెన్స్ లభిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.
పరిహారాలుః శ్రీసూర్యారాధన చేయండి. అనుకూలంగా ఉంటుంది.

కన్యరాశి: ఈరోజు మానసిక ఆందోళన !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీకు తెలియకుండా మీకు ఇష్టమైన వారి గురించి ఆందోళన పడుతారు. ఆఫీస్‌లో మీ గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు మంచిగా ఉంటుంది. వివాహం కోసం చూస్తున్నవారికి మంచి సంబంధాలు వస్తాయి. ఇంట్లో ఆనందదాయకంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించండి. వైవాహికంగా ఈరోజు సాఫీగా సాగిపోతుంది.
పరిహారాలుః శ్రీభ్రమరాంభికాష్టక పారాయణం చేయండి.

తులరాశి: ఈరోజు మిశ్రమఫలితాలు వస్తాయి !

ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆఫీస్‌లో పనికోసం ఎవరి సహకారం తీసుకోకుండా మీరే చేయండి. విజయం సాధిస్తారు. విద్యార్థులకు శుభవార్త వినే అవకాశం. పెట్టుబడి, పెట్టడానికి ఈరోజు సరైంది కాదు. వైవాహికంగా సంతోషంగా ఉంటారు.
పరిహారాలుః దేవీ ఖడ్గమాల పారాయణం చేయండి.

వృశ్చికరాశి: ఈరోజు శుభవార్తలు వింటారు !

ఈరోజు వృత్తిపరమైన ఉపాధికి సంబంధించి శుభవార్తలు వింటారు. పెద్దల సహకారం మీ భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది. కుటుంబ సభ్యులకు పూర్తి సహకారం లభిస్తుంది. మీరు ఆఫీస్‌లో అధికారి నుంచి పూర్తి మద్దతు.. వైవాహికంగా బాగుంటుంది.
పరిహారాలుః శ్రీకాలభైరావష్టకం చదవండి మంచి జరుగుతుంది.

ధనస్సురాశి: ఈరోజు లాభదాయకమైన అవకాశాలు !

చాలా కాలం తర్వాత లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. మీరు శుభవార్తలు వింటారు. పాత బాకీల వసూలు అవుతాయి. ఆఫీస్‌లో పని భారం పెరుగుతుంది. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ అన్ని ప్రయత్నాల్లో జీవిత భాగస్వామి పూర్తిగా సహకరిస్తుంది.
పరిహారాలుః శ్రీమల్లికార్జునాష్టకం చదవండి. అనుకూలంగా ఉంటుంది.

మకరరాశి: ఈరోజు అనేక సమస్యలు !

ఈరోజు మీరు అనేక సమస్యలతో ఇబ్బందిపడుతారు. మీ ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశముంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.
పరిహారాలుః శ్రీశివపంచరత్నకం పారాయణం చేయండి.

కుంభరాశి: ఈరోజు సమస్యల నుంచి విముక్తి !

ఈ రోజు మీకు మిశ్రమఫలితాలు ఉంటాయి. మీ తెలివితో సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం ఇబ్బందిగా ఉంటుంది. విజయం కోసం విద్యార్థులు మరింత కష్టపడాలి. వ్యాపారం లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.
పరిహారాలుః దేవీ ఖడ్గమాలను పారాయణం చేయండి.

మీనరాశి: ఈరోజు పెద్దల మార్గదర్శకత్వంలో పనిచేస్తారు !

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. పెద్దల అంటే తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం పొందుతారు. వారి మార్గదర్శకత్వం పొందుతారు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు టీచర్ల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలు వస్తాయి. కుటుం జీవితం సాఫీగా, సంతోషంగా ఉంటుంది.
పరిహారాలుః శ్రీలలితాష్టకం చదవండి.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version