డిసెంబర్ 31 ప్రపంచ చరిత్రలో మరువలేని రోజు

-

క్యూబా రెవేల్యుషన్ లో డిసెంబర్ 31 మరువలేని రోజు. ప్రపంచ చరిత్రలో ఈ రోజుని క్యూబా తిరుబాటు దారులు లిఖించారు. 25 నవంబర్ 1956 న గ్రాన్ మా నుంచి పడవ ప్రయాణం మొదలయింది. కాస్ట్రో సోదరులు మరియు ఎర్నెస్టో “చే” గువేరా మరియు కామిలో సియెన్‌ఫ్యూగోస్‌తో సహా 80 మందిని తీసుకువెళ్ళారు. అక్కడ మొదలైన ఉద్యమం… 1958 డిసెంబర్31కి గ్రాండ్ మార్చ్ తో ముగిసింది. 80 మందితో మొదలైన పడవ తీరం చేరే సరికి మిగిలింది20 మంది. ప్రారంభమైన మూడు రోజుల తరువాత,

బాటిస్టా యొక్క సైన్యం చాలా మంది గ్రాన్మా పాల్గొనేవారిపై దాడి చేసి చంపారు – ఖచ్చితమైన సంఖ్య వివాదాస్పదంగా ఉన్నప్పటికీ, అసలు 80 పురుషులలో ఇరవై మందికి మించి క్యూబా సైన్యంతో ప్రారంభ ఎన్‌కౌంటర్ల నుండి బయటపడి సియెర్రా మాస్ట్రాలో తప్పించుకున్నారు. పర్వతాలలో దాక్కొని ప్రాణాలను కాపాడుకున్నారు. 31 డిసెంబర్ 1958 న, శాంటా క్లారాకు ఫిడేల్ క్యాస్ట్రో చేరుకున్నాడు. అక్కడ భారీ యుద్దమే జరిగింది. దీనితో అమెరికా పెంచి పోషించిన ఆ క్యూబా అధ్యక్షుడు బాటిస్టా జనవరి 1, 1959 న డొమినికన్ రిపబ్లిక్ కోసం క్యూబా నుండి పారిపోయాడు.

ధృడ సంకల్పం తో చేసిన ఈ పోరాటంలో క్యాస్ట్రో, చేగువేరా అనుసరించిన వ్యూహాలతో ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. అలా మొదలైన గెరిల్లా పోరాటం కేవలం 2 ఏళ్ళలోనే సియెర్రా పర్వతాల నుంచీ దేశం మొత్తాన్ని హస్తగతం చేసుకునేలా ఎలా అయింది అంటే ప్రజలని ఎప్పటికప్పుడు వాళ్ళ కష్టాలకి కారణాలు చెప్తూ, తీరాలంటే ఎం చెయ్యాలో చెప్తూ మధ్యలో ఎదురు దెబ్బలకి వెనక్కి తగ్గుతూ, రేడియో ఛానల్ ద్వారా తమ లక్ష్యాలు వివరిస్తూ, కొత్త వాళ్ళకి సరైన శిక్షణ ఇస్తూ కేవలం 2 ఏళ్ళలోనే లక్ష్యం చేరుకుంది. అందుకే డిసెంబర్ 31 అనేది క్యూబా పోరాటంలో మరువలేని రోజు. ప్రపంచానికి కొత్త పాటాలు నేర్పిన రోజు.

Read more RELATED
Recommended to you

Latest news