సోషల్‌లోనే ఎక్కువ మంది ఫెయిల్.. టెన్త్‌ ఫలితాలపై రభస

-

గత సోమవారం ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన పదో తరగతి ఫలితాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఏపీలో ఈసారి టెన్త్ ఉత్తీర్ణత శాతం విపరీతంగా తగ్గడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో ఎక్కువమంది సోషల్ సబ్జెక్టులోనే తప్పడం గమనార్హం. హిందీ, ఇంగ్లిష్ వంటి కఠిన సబ్జెక్టుల్లోనూ పాస్ అయిన విద్యార్థులు.. సోషల్‌లో తప్పడానికి కారణం బిట్ పేపర్‌ను కుదించడమేనని చెబుతున్నారు.

గతంలో బిట్ పేపర్ 30 మార్కులకు ఉండగా, ఈసారి దానిని 12 మార్కులకు తగ్గించారు. కాబట్టే మార్కులు తగ్గి ఫెయిల్ అయ్యారని అంటున్నారు. సోషల్ తర్వాత ఎక్కువమంది ఫెయిలైన సబ్జెక్టుల్లో మ్యాథ్స్, సైన్స్ కూడా ఉంది. లాంగ్వేజెస్‌లో మాత్రం అత్యధికమంది విద్యార్థులు పాసయ్యారు. ఇక, ఇంగ్లిష్ సబ్జెక్టులో పాసైన వారిలో ఎక్కువమంది ప్రైవేటు స్కూళ్లకు చెందినవారు ఉండడం గమనార్హం. హిందీ పరీక్షలో 20 మార్కులకే పాస్ కాబట్టి ఆ సబ్జెక్టులో ఉత్తీర్ణత శాతం బాగానే ఉంది. ఇదిలా ఉంటే.. మేము పారదర్శంగా ఫలితాలను వెల్లడించామని విద్యాశాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version