కొత్తబట్టలు ఉతకకుండానే వేసుకుంటున్నారా..?

-

కొత్తబట్టలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కొంతమంది మహిళలకు అయితే బంగారం కొన్నా రాని ఆనందం వారికోసం ఏదైనా కొత్త బట్టలు తీసుకున్నప్పుడు బాగా వస్తుంది. వాటిని వేసుకుని తెగ మురిసిపోతుంటారు. కొత్త బట్టలు మీకు అనారోగ్యాన్ని కలిగిస్తాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. సాధారణంగా మనం కొత్తబట్టలను అలానే వేసుకుంటాం. వాష్‌ చేయం. కానీ అలా చేయడం తప్పు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అటువంటి దుస్తులను ధరించడం వల్ల ఇన్ఫెక్షన్, వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

చాలా మంది ఆన్‌లైన్‌లో దుస్తులను ఆర్డర్ చేస్తారు. వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ సరిగ్గా లేకున్నా, నచ్చకున్నా వారు దానిని రిటర్న్‌ చేస్తారు. అదేవిధంగా ట్రయల్ రూంలో బట్టలు వేసుకుని ఇష్టం లేకుంటే అక్కడే వదిలేస్తున్నారు. షాప్‌ వాళ్లు మళ్లీ వాటిని నీట్‌గా ఫోల్డ్‌ చేసి ర్యాక్‌లో పెడతారు. కొన్నిసార్లు అలాంటి దుస్తులు ధరించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.

షోరూమ్ ట్రయల్ రూమ్‌లో కూడా బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఎవరైనా మాల్ లేదా షోరూమ్‌కి బట్టలు కొనడానికి వెళితే ముందుగా చేసే పని ట్రయల్ రూమ్‌కి వెళ్లి ఫిట్టింగ్‌ని చెక్ చేయడం. బట్టలు సరికానప్పుడు, వారు వాటిని అక్కడ వదిలివేస్తారు. కానీ వ్యక్తి చెమట లేదా మురికి ఆ బట్టలకు అంటుకుంటుంది. మనలాంటి వాళ్లం అదే డ్రస్‌ వేసుకుని, మనకు నచ్చితే తీసుకుంటాం. అలానే ఉతకకుండా వేసుకుంటారు. ఆ చెమట మీకు అంటుతుంది.

ఆన్‌లైన్‌లో షాపింగ్‌లో కూడా అంతే. మీకు అది నచ్చితే కచ్చితంగా ఉతికిన తర్వాతే వేసుకోవాలి. ట్రయల్‌ వేసిన తర్వాత మీరు స్నానం చేయడం ఉత్తమం. చాలా కంపెనీలు బట్టలపై మరకలు, రంగులు, మృదువుగా ,ముడతలు తొలగించడానికి వివిధ రసాయనాలను ఉపయోగిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ రసాయనం గురించి కంపెనీలు పెద్దగా సమాచారం అందించనప్పటికీ… ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాలను మిక్స్ చేసే కంపెనీలు చాలా ఉన్నాయి.

పిల్లలు, గర్భిణులకు కొత్త బట్టల వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలకు మొలస్కం వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం బారిన పడే అవకాశం ఎక్కువ. అదే సమయంలో, గర్భధారణ సమయంలో మహిళల రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. కాబట్టి మీరు ఎంత పెద్ద షోరూంలో బట్టలు కొన్నా సరే వాటిని ఉతికిన తర్వాతనే ధరించండి.

Read more RELATED
Recommended to you

Latest news