Deepika Pilli : క్యూట్ ఎక్స్​ప్రెషన్స్​తో దీపికా పిల్లి మెస్మరైజింగ్ ఫొటోషూట్

-

టిక్​టాక్​ వీడియోలు.. ఆ తర్వాత ఇన్​స్టాగ్రామ్ రీల్స్​తో ఓవర్​నైట్ స్టార్లుగా మారిన అమ్మాయిల్లో దీపికా పిల్లి ఒకరు. సోషల్ సోషల్​ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్ నుంచి టాలీవుడ్​ హీరోయిన్​గా ఈ బ్యూటీ ప్రయాణం సాగుతోంది. ఓవైపు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు హోస్టుగా చేస్తూనే.. మరోవైపు ఓటీటీల్లోనూ తన సత్తా చాటుతోంది. ఇంకోవైపు సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్​గా ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ భామ తన కొత్త ఫొటోలు షేర్ చేసింది. బ్లూ కలర్ డ్రెస్సులో ఈ భామ మెరిసిపోయింది. ఓ కామెడీ షో హోస్టుగా చేస్తున్న దీపిక.. ఆ షో కోసం ఇలా క్యూట్​గా రెడీ అయింది. ఈ ఫొటోషూట్​లో క్యూట్ ఎక్స్​ప్రెషన్స్ ఇస్తూ ఫ్యాన్స్​ను మెస్మరైజ్ చేసింది.

తాజాగా ‘వాంటెడ్ పండుగాడ్​’ అనే సినిమాలో జబర్దస్త్​ ఫేమ్​ సుధీర్ సరసన నటించింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో వస్తున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోలో సుడిగాలి సుధీర్​తో పాటు యాంకర్​గా వ్యవహరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఎల్లప్పుడూ యాక్టివ్​గా ఉండే దీపిక.. తన అభిమానుల కోసం ఇన్​స్టాలో లేటెస్ట్​ ఫొటో షూట్​ను షేర్​ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news