TOKYO OLAMPICS : భారత పురుషుల హాకీ జట్టుకు ఘోర పరాజయం

-

టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా హాకీ జట్టుకు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ప్రపంచ నంబర్‌ వన్‌ టీం ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం పాలైంది. పూల్‌- ఏలోని రెండో మ్యాచ్‌ లో టీం ఇండియా 1-7 తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌ లో ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా ఏ దశలోనూ ఇండియాకు అవకాశం ఇవ్వలేదు.

దీంతో టీం ఇండియాపై ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. ఈ ఒలింపిక్స్‌ లో వరుసగా రెండో మ్యాచ్‌ లోనూ ఆస్ట్రేలియా గెలుపొందటం గమనార్హం. ఇక అంతకు ముందుకు.. తొలి మ్యాచ్‌ లో టీం ఇండియా న్యూజిలాండ్‌ జట్టును 3-2 తేడాతో మట్టికరిపించిన సంగతి తెలిసిందే. కానీ ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్‌ లో మాత్రం టీం ఇండియా.. ఎక్కడా కూడా గట్టిగా పోటీ ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్‌ లో ఓడిన టీం ఇండియా… స్పెయిన్‌ టీం తో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ మంగళ వారం రోజున జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version