రాజుకుంద్రాకు విలన్లుగా మారిన సొంత ఉద్యోగులు !

-

శిల్పశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్న్‌ కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే…రాజ్‌కుంద్రా పోర్న్‌ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు అదుపులో ఉన్న రాజుకుంద్రాకు రోజు రోజుకు ఉచ్చు బిగిస్తూనే ఉంది. తాజాగా ఆయన కంపెనీలో పనిచేసే ఉద్యోగులే విలన్లుగా మారారని సమాచారం. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు ఏకంగా నలుగురు ఉద్యోగులు ముందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.

ఈ మేరకు వారు సీబీఐని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ వివరాలను వెల్లడించేందుకు రాజ్‌ కుంద్రా సహకరించడం లేదని క్రై బ్రాంచ్‌ పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు ఉద్యోగులు సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రావడంతో పోలీసుల పని సులువు అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఆ ఉద్యోగుల నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికి పోలీసులు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. వారిని విచారిస్తే.. అసలు గుట్టు బయట పడుతుందని పోలీసులు ఆలోచన చేస్తున్నారట. ఇక ఈ కేసు ఎన్ని మలుపు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version