దిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం

-

దిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ, సీబీఐ సంయుక్త దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసిన అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు అనుమతితో కస్టడీకి కూడా తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు అభిషేక్, విజయ్ నాయర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి దాకా సీబీఐ అదుపులో ఉన్న వీరిని కోర్టు ఉత్తర్వుల సమయంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు తెలిపారు. వీరి బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇదే కేసులో అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి, లిక్కర్ వ్యాపారి బినోయ్‌బాబులు ఈడీ కస్టడీలో ఉన్నారు. శరత్‌, బినోయ్‌బాబు ఇచ్చిన వివరాలతో అభిషేక్, విజయ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా అభిషేక్, విజయ్‌లను కస్టడీకి ఇవ్వాలని ఈడీ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు ఇవాళ మధ్యాహ్నం విచారణ జరపనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version