డిల్లీ లో హడావిడి చేసిన పవన్ కల్యాణ్ పైన నేషనల్ మీడియా భారీ సెటైర్ ?

-

2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ ని స్థాపించారు పవన్ కళ్యాణ్. అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చానని ఆ సమయంలో ఎన్నికలలో పోటీ చేయకుండా చంద్రబాబుకి మరియు బీజేపీకి మద్దతు తెలిపారు. తనకు రాజకీయాల కంటే దేశం అంటే ఎంతో ప్రేమ అని భగత్ సింగ్ తనకు ఆదర్శం అంటూ జనసేన పార్టీ స్థాపించిన మొదటి ప్రసంగంలో భారీ భారీ డైలాగులు వేశాడు పవన్. అదే సమయంలో  ‘‘నేను అంతా పిడికెడు మట్టే కావచ్చు. కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది’’ అన్న పవన్ కళ్యాణ్ తాను మద్దతు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి అవినీతి చేసిన ఎక్కడ ప్రశ్నించలేదు.

తర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేసిన పవన్ నిలబడిన రెండు చోట్ల ఓడిపోయారు. పవన్ ఓటమితో చాలా మంది పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాల్లోకి వెళ్లిపోతారని ఆ సమయంలో డైలాగులు వేయటం జరిగింది. వెంటనే మీడియా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్…నా చివరి కట్టె కాలే వరకు అదేవిధంగా రాజకీయాలు తప్ప సినిమా రంగంలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని భారీ డైలాగులు వేశారు. అయితే ఇప్పుడు ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఢిల్లీ పర్యటన చేపట్టిన పవన్ కళ్యాణ్ ఢిల్లీలో విజ్ఞాన్ బిల్డింగ్ లో ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంటు సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..సమాజంలో మార్పు తీసుకురావటానికి పాలిటిక్స్ లో అడుగు పెట్టడం జరిగింది అన్నారు. నా దేశం కోసం నా జీవితాన్ని ధారపోస్తా…సమాజసేవలో నావంతు పాత్రను త్రికరణ శుద్ధితో నిర్వహిస్తా అంటూ పవన్ ప్రసంగించడం తో బిల్డింగ్ లో ఉన్న విద్యార్థులు అంతా చప్పట్లు విజువల్స్ తో హోరెత్తించారు. ఇదే సమయంలో మరో పక్క ఢిల్లీలో ఉన్న నేషనల్ మీడియా పవన్ కళ్యాణ్ ప్రసంగం పై భారీ సెటైర్ వేసింది. మైకు ముందు ఓటు హక్కు లేని పిల్లల ముందు నీతి పలుకులు చెప్పడం తప్ప వాస్తవ జీవితంలో పవన్ కళ్యాణ్ కి అంత సీన్ లేదు…అతడు చెప్పే మాటపై నిలబడే మనిషి కాదు అందుకే రెండు చోట్ల ఆంధ్రా వాళ్ళు ఓడించారు పవన్ కళ్యాణ్ ని  అని భారీ సెటైర్ వేయటం తో జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ పరువు పోయినట్లు అయింది.  

Read more RELATED
Recommended to you

Exit mobile version