దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కాలుష్యం ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరుకుందో అందరికీ తెలిసిందే. ఢిల్లీలో ఉన్న తీవ్రమైన కాలుష్యం దృష్ట్యా ఆ నగరంలో కూడా డార్జిలింగ్‌లా చలికాలంలో కొన్ని రోజుల పాటు అందరికీ సెలవులు ఇస్తే బాగుంటుందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కాలుష్యం ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరుకుందో అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా దీపావళి నుంచి అక్కడ కాలుష్యం తీవ్రత మరింత పెరుగుతుంది. శీతాకాలంలో అక్కడి ప్రజలు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతుంటారు. అందులో భాగంగానే అక్కడ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రతి ఏడాదిలాగానే ఇప్పుడు కూడా సరి, బేసి విధానాన్ని అమలు చేస్తోంది. అయితే ఢిల్లీలో కాలుష్యం తీవ్రతను అరికట్టేందుకు, ఢిల్లీని కాలుష్యం నుంచి సేవ్ చేసేందుకు డార్జిలింగ్‌లో అమలులో ఉన్న ఓ విధానాన్ని అమలు చేయాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ఇంతకీ అసలు డార్జిలింగ్ అమలు చేస్తున్న ఆ విధానం ఏమిటి..? అంటే..
డార్జిలింగ్‌లో సాధారణ సమయంలోనే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. వాతావరణం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. ఇక శీతాకాలంలో అయితే ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయి. దీంతో పాఠశాలలు, కాలేజీలకు వేసవి సెలవుల్లా.. శీతాకాలం సెలవులు ఇస్తారు. నవంబర్ మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య వరకు ఆ సెలవులు ఉంటాయి. తీవ్ర వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక అక్కడ నివాసం ఉండే వారు సమీపంలోని కొండ ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే అలాంటి వాతావరణ స్థితి ఢిల్లీలో లేకున్నా.. ఢిల్లీలో ఉన్న తీవ్రమైన కాలుష్యం దృష్ట్యా ఆ నగరంలో కూడా డార్జిలింగ్‌లా చలికాలంలో కొన్ని రోజుల పాటు అందరికీ సెలవులు ఇస్తే బాగుంటుందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
డార్జిలింగ్‌లో ఉన్నన్ని సుదీర్ఘమైన శీతాకాలం సెలవులు కాకుండా, దీపావళి ఆరంభం అయ్యే నాటి నుంచి 15-20 రోజుల వరకు ఢిల్లీలో పూర్తిగా సెలవులు ప్రకటించి, అసలు వాహనాలు ఏవీ రోడ్లపై తిరగకుండా, అన్ని కార్యాలయాలకూ పూర్తిగా సెలవులు ఇస్తే కాలుష్యం తీవ్రత బాగా తగ్గుతుందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రోడ్లను శుభ్రం చేయడం, కాలుష్యం తీవ్రతను తగ్గించేందుకు మొక్కలను నాటడం.. తదితర పనులు చేస్తే కొంత వరకు కాలుష్యం నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. మరి.. ఢిల్లీ ప్రభుత్వం ఈ విషయంలో ఏ వైఖరి అనుసరిస్తుందో చూడాలి..! ల